ఖైరతాబాద్ మెట్రో రికార్డు.. ఒక్క రోజులోనే..

209
Hyderabad Metro Rush

హైదరాబాద్ మెట్రో సంస్ధ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఆదివారం ఒక్క రోజులోనే 70వేల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. గణేశ్ పండుగ సందర్భంగా ఖైరతాబాద్ లోని వినాయకుడిని చూసేందుకు హైదరాబాద్ నగర వాసులు భారులు తీరారు.

ఆదివారం కావడంతో ఖైరతాబాద్ వినాయకుడిని చాలా మంది దర్శించుకున్నారు. ఈసందర్భంగా చాలా మంది ఖైరతాబాద్ కు మెట్రో లో ప్రయాణించారు. ఖైరతాబాద్ కు మొత్తం 70వేల మంది రాకపోకలు సాగించగా..అందులో 40మంది అక్కడ దిగగా, మరో 30మంది మెట్రో ఎక్కినట్లు తెలిపారు.

మెట్రో సేవలు ప్రారంభమైన తర్వాత ఒక స్టేషన్ నుంచి ఒక రోజులో ఇంతమంది ప్రయాణించడం ఇదే తొలిసారి అని తెలిపారు అధికారులు. వినాయక పండుగ పురస్కరించుకుని ఖైరతాబాద్ నుంచి అన్ని వైపులా రాత్రి 11.30గంటల వరకు మెట్రోను నడుతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.