గంగమ్మ ఒడిలోకి మహాగణపతి

615
lord ganesh
- Advertisement -

9 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం ముగిసింది. టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్‌కు చేరుకోగా మహాగణపతిని పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.

గణనాథునికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా పోలీస్ భద్రతా మధ్య ప్రశాంతంగా శోభాయాత్ర సాగింది. చిన్నారులు, యువత, మహిళలతో ట్యాంక్ బండ్ కోలాహలంగా మారింది.

ఖైరతాబాద్‌ మహాగణపతిని కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేసేవారు. అయితే ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహం సగం మాత్రం నిమజ్జనం అవుతుండటంతో అగమ శాస్త్ర నియమాల ప్రకారం గణపతి విగ్రహాలు గంగలో పూర్తిగా నిమజ్జనం కావాలి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం విగ్రహాన్ని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. క్రేన్‌ నం. 6వ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు.

- Advertisement -