ఈ ఏడాది‘శ్రీద్వాదశాదిత్య మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు..

665
Khairatabad Ganesh 2019
- Advertisement -

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకం… దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ భారీ గణనాథుడు ఊరేగింపుగా వెళ్లడం హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతుంది. ఇతర నగరాల్లో భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినా… అక్కడే నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతి ‘శ్రీద్వాదశాదిత్య మహాగణపతి’గా కొలువుదీరనున్నాడు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను,విగ్రహానికి సంబంధించిన నమూనాను ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌, విగ్రహ శిల్పి రాజేంద్రన్‌, ఉత్సవ కమిటీ విడుదల చేసింది.

Khairatabad Ganesh 2019

మహాగణపతి విగ్రహం ప్రత్యేకతలు.. ఈసారి మహాగణపతి విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహం కోసం ఇప్పటికే 65 అడుగుల ఎత్తున షెడ్డు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. విగ్రహం ముఖ భాగం సూర్యుడిని పోలి ఉంటుందని.. విగ్రహానికి 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలు, 7 గుర్రాలు ఉంటాయని వివరించారు. విఘ్నేశ్వరుడికి కుడి, ఎడమ భాగాల్లో సిద్ధ కుంజిగాదేవి, దత్తాత్రేయ విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహానికి కుడివైపున గల చిన్న మండపంలో మహావిష్ణువుతో పాటు ఏకాదశా దేవి విగ్రహం, ఎడమవైపున మహాకాళితో పాటు త్రిమూర్తుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాలను 16 అడుగుల పొడవుతో నిర్మించనున్నారు.

65వ సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్‌ మహాగణపతి నిర్వాహకులు అత్యంత అద్భుతంగా భక్తులకు ఈ ఏడాది కూడా అద్భుత రూపంలో దర్శనమిచ్చే విధంగా మహాగణపతి విగ్రహాన్ని రూపోందించనున్నారు.గత నెల సర్వేకాదశి సందర్భంగా మే మొదటి వారంలో ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులకు కర్రపూజ కూడా నిర్వహించారు.

- Advertisement -