ప్రభాస్ కోసం కె.జి.ఎఫ్ హీరో.. ఏం చేశాడో తెలుసా?

444
Prabhas Yash
- Advertisement -

 కె.జి.ఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్. తెలుగు, తమిళ, కన్నడ తో పాటు ఉత్తర భారత దేశంలో కూడా యష్ నటించిన సినిమాలకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన కె.జి.ఎఫ్ 2లో నటిస్తున్నాడు. ఆయనతో సినిమాలు తీయడానికి చాలా మంది దర్శకులు క్యూ ఉన్నారు. తాజాగా ఓ కొత్త దర్శకుడు యష్ కు ఒక స్టోరీ వినిపించాడట.

అయితే ఈ స్టోరీ లో హీరో క్యారెక్టర్ హై రేంజ్ లో ఉండటంతో తనకు సెట్ కాదని చెప్పాడట. అంతే కాకుండా ఆ దర్శకుడిని ప్రభాస్ దగ్గరకు పంపించాడట. ఈకథ ప్రభాస్ కు అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పాడట. దీంతో యష్ వెంటనే ప్రభాస్ కు ఫోన్ చేసి ఆ దర్శకుడు చెప్పే కథ వినాలని సూచించాడట.

తను ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించటం అంటే అంత తేలిగ్గా జరిగే పని కాదని, అది యష్ కు కథ చెప్పటం వలనే జరిగిందని అంటున్నారట. త్వరలోనే ప్రభాస్ కు ఆయన కథ చెప్పారని కన్నడ మీడియా అంటోంది. ఆ దర్శకుడు చెప్పే కథ ప్రభాస్ కు నచ్చుతుందో లేదో చూడాలి మరి.

- Advertisement -