టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు.

489
keshavarao
- Advertisement -

టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎం.పి. నామా నాగేశ్వర్ రావు ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోకసభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్ ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈనెల 17 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించారు సీఎం కేసీఆర్.

టీఆర్ఎస్ నుంచి 9 మంది ఎంపీలు  గెలుపొందారు. కొత్త ప్రభాకర్ రెడ్డి,నామా నాగేశ్వరావు,పసునూరి దయాకర్‌,బీబీ పాటిల్ రెండోసారి ఎంపీలుగా ఎన్నికవగా వెంకటేశ్ నేత, పి. రాములు,రంజిత్ రెడ్డి, మాలోతు కవిత,మన్నె శ్రీనివాస్ రెడ్డి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

- Advertisement -