కేజ్రీకి బిగ్ రిలీఫ్….

230
Kejriwal Catches Big Break
- Advertisement -

ఢిల్లీలో బీజేపీలో వరుస విజయాలతో డీలా పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కేజ్రీవాల్ పాలనకు రెఫరెండమ్‌గా సాగిన బావానా అసెంబ్లీ పోరులో ఆమ్ ఆద్మీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్ధిపై 24 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్ధి రాంచందర్ ఘనవిజయం సాధించారు.

ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్  ఈ ఏడాది మార్చిలో బీజేపీలోకి జంప్ కావడంతో బవానాకు ఉప ఎన్నిక అవసరమైంది. ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆయనకు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ మూడో స్ధానంతో సరిపెట్టుకుంది. ఆప్‌ గెలుపుతో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం నిరూపితమైందని మంత్రి సత్యేందర్ అన్నారు. బీజేపీకి ప్రజలు తగ్గిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ గెలుపుతో 70 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య 66కి చేరింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలు ఎంత ఉత్కంఠభరింతగా, ఆసక్తికరంగా సాగాయో అందరికీ తెలిసిందే. సీఎం చంద్రబాబు పాలనకు రిఫరెండమ్‌గా జగన్ ప్రతిష్టకు సవాల్‌గా మారిన ఎన్నికల్లో అధికార టీడీపీ పై చేయి సాధించింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. గోవా ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సైతం విజయం సాధించారు.

- Advertisement -