బీజేపీలోకి మహానటి..?

69
Keerthy Suresh

నటి కీర్తి సురేష్‌ మహానటి చిత్రంతో భారీగా క్రేజ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళ,హిందీ చిత్రాల్లో నటిస్తు బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు రాజకీయ రంగప్రవేశంపై భారీ ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ మహానటి బీజేపీలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాతో ఆమెకు మరింత పేరు వచ్చింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్‌ క్రేజ్‌ను వాడుకోవాలని బీజేపీ నేతలు యత్నిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Keerthy Suresh

అంతే కాదు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కీర్తి ఇటీవల భేటీ అయ్యినట్లు సమాచారం. ఇక ఇప్పటికే కీర్తి సురేష్‌ బీజేపీ తరఫున ప్రచారం కూడా చేసిందనే టాక్‌ వైరల్‌ అవుతోంది. ఇన్ని విషయాలు వైరల్‌ అవుతున్నా కీర్తి సురేష్‌ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. కానీ.. తాజాగా ఆమె తల్లి ఈ వ్యవహారం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కీర్తి తండ్రి బీజేపీ నేతగా గుర్తింపు ఉంది. ఎన్నికల్లో ప్రచారం చేయకున్నా.. తండ్రి సూచనతో ఢిల్లీలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లుగా ఆమె తల్లి మేనకా సురేష్‌ వెల్లడించారు.

అయితే ప్రచారం అనంతరం తాను, కీర్తి, నటుడు సురేశ్ గోపి, నటి కవిత ప్రధాని మోడీని కలిశామని ఆమె తెలిపారు. దీంతోనే కీర్తి సురేశ్ బీజేపీలో చేరారనే ప్రచారం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. తనకు గానీ, కీర్తికి గానీ రాజకీయాలపై ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై కీర్తీ మాత్రం ఇప్పటివరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.