ఈ అవార్డు అమ్మకే అంకితం : కీర్తి సురేష్

583
keerthi suresh
- Advertisement -

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది.4 సినిమాలకు 7 పురస్కారాలు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. ఉత్తమచిత్రంగా మహానటి నిలవగా అ!, రంగస్థలం, చి.ల.సౌ. చిత్రాలు సత్తాచాటాయి.

అసమాన నటనకు, అద్వితీయమైన సౌందర్యానికి, తెలుగుదనానికి ప్రతీకలా నిలిచిన సావిత్రి జీవితకథతో రూపొందించిన మహానటి చిత్రం సత్తాచాటింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

తనకు అవార్డు రావడంపై కీర్తి సురేష్ స్పందించింది. ఉత్తమ నటి పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని…..ఈ అవార్డును తన అమ్మకు అంకితమిస్తున్నట్లు మహానటి ప్రకటించింది.ఇక తనకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన మహానటి చిత్రబృందం మొత్తానికి కృతఙ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఇదో గొప్ప అనుభూతి అని చెప్పారు.

- Advertisement -