మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్‌,జగన్‌..!

391
kcr jagan
- Advertisement -

ఈ నెల 30న రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. రాత్రి 7 గంటలకు జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు,పార్టీల నేతలు పాల్గొననున్నారు.

ఇక అదేరోజు ఉదయం 12.20 గంటలకు ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నెల 29న విజయవాడకు చేరుకుంటారు కేసీఆర్. 30న కనకదుర్గమ్మను దర్శించుకుని జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీఆర్‌తో కలిసి జగన్‌ కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్,వైసీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

- Advertisement -