ప్రజాక్షేమం కోసమే మహారుద్ర సహితయాగం..

258
kcr yagam
- Advertisement -

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల, మహా రుద్ర సహిత యాగం నేటితో ముగియనుంది.అనంతరం ఖమ్మం,పాలకుర్తిలో జరిగే బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠం ఆస్థాన పండితులు ఫణి శశాంక శర్మ, గోపీ కృష్ణ శర్మల పర్యవేక్షణలో యాగం జరిగింది. ఇవాళ ఉదయం 11.11 గంటలకు యాగం సమాప్తమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు ఇందులో పాల్గొన్నారు. కేసీఆర్‌ దంపతులతో పాటు కోడలు శైలిమ, మనుమడు హిమాన్ష్‌, మనవరాలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

kcr yagam

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే యాగం లక్ష్యమని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పరమేశ్వరుని దయతో తెలంగాణ అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 2.45 గంటలకు జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాలకుర్తి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

- Advertisement -