ఎంపీలుగా మాజీ ఎమ్మెల్సీలు..!

219
kcr ls elections
- Advertisement -

కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ,ఎంపీ ఎన్నికలపై దృష్టిసారించారు సీఎం కేసీఆర్. 9 మందితో కేబినెట్‌ను విస్తరించనున్న కేసీఆర్ మంత్రిపదవులు దక్కనివారికి చీఫ్ విప్,డిప్యూట్ స్పీకర్‌,విప్‌,మండలి ఛైర్మన్‌లుగా నియమించనున్నట్లు సమాచారం.

ఇక పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. సర్వేలో కొంతమంది సిట్టింగ్‌లపై ప్రతికూలత రావడంతో వారిని మార్చేందుకు సిద్ధమయ్యారు గలాబీ బాస్.అయితే కొన్నిస్థానాల్లో సిట్టింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ స్థానాల్లో కొత్త అభ్యర్థులు తెరమీదికి రానున్నారని తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి స్థానం నుంచి మాజీ మంత్రి ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ స్థానానికి సైతం మాజీ మంత్రి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిసారించనున్న కేసీఆర్…కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎంపిక చేయాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -