కేసీఆర్…అనే నేను

271
kcr oath
- Advertisement -

తెలంగాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీబాధ్యతలు చేపట్టారు కేసీఆర్. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 1.25 నిమిషాలకు కేసీఆర్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్‌తో పాటు మహముద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 18న మంత్రివర్గ ప్రమాణంతో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే అవకాశం ఉంది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కేసీఆర్‌ 8వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  1983లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి రాజకీయ అరగ్రేటం చేసిన కేసీఆర్‌.. 1985లో తొలిసారి గెలుపొందారు. అప్పటినుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు (2001 ఉప ఎన్నికలు కలుపుకొని) సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2014 ఎన్నికల్లో, తిరిగి తాజా ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి విజయం సాధించారు. దీంతోపాటు వివిధ లోక్‌సభ స్థానాల నుంచి ఐదుసార్లు ఎంపీగానూ గెలిచారు కేసీఆర్.

- Advertisement -