కాంగ్రెస్,బీజేపీలపై సీఎం కేసీఆర్ ఫైర్

218
- Advertisement -

రైతుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే రైతు సమన్వయ సమితులు అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కరీంనగర్‌లో మండల,జిల్లా స్ధాయి రైతు సమన్వయ సమితి సదస్సులో పాల్గొని మాట్లాడిన కేసీఆర్…తెలంగాణలో కోటీ 60 లక్షలకు పైగా భూమి సాగులో ఉందన్నారు. కాంగ్రెస్,బీజేపీ వ్యతిరేక పాలన వల్లే రైతులకు ఈ దుస్ధితి వచ్చిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.

నిరంతర పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. కాంగ్రెస్,బీజేపపీ నేతల తెలివితక్కువ పాలన వల్లే రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్ధితి వచ్చిందన్నారు. మార్చి 5 నుంచి జరిగే కేంద్రబడ్జెట్ సమావేశాల్లో రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు సీఎం. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే రైతులు ఎందుకు రాజు కాలేదని ప్రశ్నించారు. కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే రైతులు తిరగబడే పరిస్ధితి వస్తుందన్నారు.

బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నా.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ధర్నాలు చేయడం చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఒకరేమో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి మరొరేమో రాజీవ్-ఇందిరా గాంధీ కుటుంబాల మాట్లాడటం తప్ప రైతులకు చేసింది ఏంటని దుయ్యబట్టారు కేసీఆర్.

kcr

నిరంతర పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమైందని…అదే పోరాట స్పూర్తితో రైతుల బతుకుల్లో వెలుగులు నింపుదామన్నారు. అందరం కలిస్తే గమ్యాన్ని
చేరుకుంటామన్నారు.రైతులు బంగారాన్ని పండించాలని…అప్పులు లేని పరిస్ధితి రావాలనే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామన్నారు. రైతు సమన్వయ సమితులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. స్ధానిక సంస్ధలు నిర్వీర్యం అవుతాయన్న ఆరోపణాలు నిరాధారమైనవని చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో మనం దారుణంగా దెబ్బతిన్నామని…కానీ నేడు ఆ పరిస్ధితి లేదన్నారు. మిషన్ కాకతీయ,ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కాబోతుందన్నారు.కాళేశ్వరంతో ఎస్సారెస్పీకి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. కరీంనగర్‌ రైతులు ఇకపై నీటికోసం ఆకాశం వైపు చూసే పరిస్ధితి రాదన్నారు.

- Advertisement -