హుజుర్‌నగర్‌పై సీఎం కేసీఆర్ వరాలజల్లు..

644
kcr
- Advertisement -

టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన హుజుర్‌ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరందించిన విజయం ప్రభుత్వంలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. సూర్యపేట జిల్లా హుజుర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా కృతజ్ఞత సభలో మాట్లాడిన సీఎం వరాల జల్లు కురిపించారు.

హుజుర్‌నగర్‌లోని 136 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 7 మండల కేంద్రాలకు ప్రతీ మండల కేంద్రానికి 30 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. హుజుర్‌ నగర్‌ మున్సిపాలిటీకి 25 కోట్లు మంజూరు చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.

హుజుర్‌నగర్‌లో 30 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని చెప్పారు. హుజుర్‌నగర్‌లో గిరిజన రెసిడెన్షియల్ స్కూల్,బంజార భవన్ నిర్మాణం చేపడతామన్నారు. ప్రజా దర్బార్ ద్వారా పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.హుజుర్‌నగర్‌లో రెవెన్యూ డివిజన్ వస్తుందని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హుజుర్‌నగర్‌లో కోర్టును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణంలో పెద్దపీట వేస్తామని చెప్పారు.

- Advertisement -