మహాత్మునికి నివాళులర్పించిన గవర్నర్,సీఎం కేసీఆర్

557
- Advertisement -

మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా మహాత్ముని జయంతి ఉత్సవాలు జరుగుతుండగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మునికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు , ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనంలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు.

kcr

మహాత్ముడు చూపిన దారిలోనే అహింస,సత్యాగ్రహ దీక్షల స్పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్రాన్ని సాధించామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో సాగిన శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం భారత ప్రజాస్వామిక వ్యవస్థపై నమ్మకం పెంచిందని, గాంధీ మార్గానికి మరింత సార్థకతను చేకూర్చిందని వివరించారు.

kcr

 

 

ఆయన చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణను సాధిస్తామని టీఆర్‌ఎస్‌ స్థాపించిన తొలినాళ్లలోనే నేను ప్రకటించాను. ఆ మార్గం వీడకుండా గమ్యం చేరుకున్నాం అన్నారు.

kcr

- Advertisement -