కలెక్టర్‌ ఇకపై డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్..!

348
kcr
- Advertisement -

రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయడమే కాదు కొత్త మున్సిపల్ చట్టంలో మార్పులు చేసేలా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం ప్రజలకు మెరుగైన సేవలు,అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహలోనే తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం. రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగేందుకు అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేయనున్నారు. కలెక్టర్ పేరును డిస్ట్రీక్ అడ్మినిస్టేషన్ ఆఫీసర్ గా మార్చాలనే అంశంపై అలోచించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు.

దీంతో ఇకపై తెలంగాణలో కలెక్టర్ పేరు కనుమరుగు కానుంది. కలెక్టర్ పేరు మార్చిన తర్వాత జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్య అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి,వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించనున్నారు. జిల్లా స్థాయిలో ప్రధాన పనులన్ని ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం నిర్వహిస్తుంది. ఫైళ్ల ఆలస్యానికి కారణమయ్యే ఉద్యోగులపై జరిమానా విధించేలా సమూల మార్పులు చేయనున్నారు.

- Advertisement -