అద్భుతమైన పోరు గడ్డ మహబూబాబాద్-కేసీఆర్‌

310
KCR
- Advertisement -

నాయకులకంటే ప్రజలకే ఎక్కువగా అవగాహన ఉంటుంది. మీరిచ్చే తీర్పులు, నిర్ణయాలు అంత బాగుంటాయి. ప్రతి విషయాన్ని మీరు గమనిస్తున్నారని చెప్పారు సీఎం కేసీఆర్‌. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. మహబూబాబాద్‌ను ఎందుకు జిల్లా చేయాల్సి వచ్చిందని చాలా మంది తనను అడుగుతున్నారని.. ఒక్క మహబూబాబాదే కాదు.. పూర్వ వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, జనగామను కూడా జిల్లాలుగా చేసుకున్నామని.. వాటిని జిల్లాలుగా ఎందుకు చేసుకున్నామో సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ ప్రాంతాలన్నీ గిరిజనులు కేంద్రీకృతమైన ప్రాంతాలని.. వాళ్లు బాగుపడాలంటే ఏదో డంభాచారాలు కొడితే పని కాదని.. గిరిజనుల బతుకుల్లో వెలుతురు రావాలంటే పరిపాలన వాళ్ల దగ్గరికే రావాలన్నారు. అందుకే నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ, పోడుభూముల పరిష్కారం బాధ్యత, ఇతర సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని సీఎం కేసీఆర్ అన్నారు. జూన్ తర్వాత వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉంటా. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందాం. అద్భుతమైన పోరు గడ్డ మహబూబాబాద్. ఈ గడ్డకు నేను తల వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు సీఎం కేసీఆర్‌.

ఉద్యమ సమయంలో ఢిల్లీలో నన్ను అడిగేవారు. కేసీఆర్ తెలంగాణ వస్తే ఏం చేస్తావు అని వివిధ రాష్ట్రాల వారు అడిగే వాళ్లు. వాళ్లందరు కూడా ఇప్పుడు వివిధ సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. వివిధ రాష్ట్రాల నాయకులు,ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ సంక్షేమం కోసం ఏంచేస్తున్నామనేది దేశమంతా తెలుసు. అని అన్నారు సీఎం. గిరిజన బిడ్డ.. చదువుకున్న వ్యక్తి.. కవితను పార్లమెంట్‌కు పంపిద్దాం. కవితను దీవించి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించండి.. అని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

- Advertisement -