తప్పెక్కడ జరిగింది…ఇంటర్‌ రిజల్ట్స్‌పై సీఎం కేసీఆర్ ఆరా

273
kcr inter results
- Advertisement -

ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. ఇంటర్ ఫలితాల గందరగోళంపై ఆరా తీసిన కేసీఆర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తప్పెక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో పాటు ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని ఆరా తీశారు. ఇంటర్ విద్యార్థులను తగిన న్యాయం జరిగేలా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు గురువారం ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే నిందితులుగా తేలితే ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అపోహలకు పోయి ఆందోళన చెందవద్దని సూచించారు. సాంకేతిక లోపమైతే ఆ సంస్థపైన, మానవ తప్పిదమైతే సంబంధిత అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -