కాళేశ్వరం జలాలను చూసి మురిసిన సీఎం కేసీఆర్

517
kcr kaleshwaram
- Advertisement -

సూర్యాపేట లో లంచ్ ముగించుకుని హూజుర్ నగర్ కృతజ్ఞతా సభకు బయలు దేరిన ముఖ్యమంత్రి మార్గ మధ్యంలో కాళేశ్వరం జలాలను మోసుకెళ్తున్న కాల్వల వద్ద ఆగి పుష్పాలు చల్లి పూజలు చేసినారు.

కాకతీయ కెనాల్ టైల్ ఎండ్ పాయింట్ (తిరుమలగిరి మండలం) నుంచి డి బి ఎం 71 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి మీదుగా 50 కిలోమీటరు కు చేరుకుని..అటునుంచి పెన్ పహాడ్ మండలం చివరి ఆయకట్టు రాగి చెరువు దిశగా ప్రవహిస్తున్న కాలేశ్వరం జలాలకు మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి పుష్పార్చన చేసి నమస్కరించుకొన్నారు.

తమ జీవితంలో మొదటిసారి నదీ జలాలను చూస్తున్నామని అది సీఎం కెసిఆర్ కృషి ఫలితమే నని రైతులు జేజేలు పలికారు. గోదావరి జలాలను చూసిన రైతుల కండ్లల్లో ఆనందాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు.

- Advertisement -