కేసీఆర్‌ కిట్‌లో చేనేత చీర..

437
kcr kit scheem
- Advertisement -

చేనేతకు చేయూత నందించేందుకు రాష్ట్ర పరిశ్రమలు,చేనేత మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషి చేస్తున్నారు. ఇప్పటికే చేనేతకు ప్రచారకర్తగా మారిన కేటీఆర్ ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాదు తెలంగాణ చేనేత శాఖ (టెస్కో) ద్వారా చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న కేటీఆర్ సినీ ప్రముఖులను కూడా భాగస్వాములను చేస్తున్నారు.

'KCR Kits' to newborns

ఇక తాజాగా ప్రసూతి మరణాలు, శిశు మరణాల నియంత్రణ కోసం  సీఎం కేసీఆర్ అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. నిరుపేద గర్భిణీలకు ఆర్థిక సహాయాన్ని అందించనునున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు తల్లిబిడ్డల సంరక్షణకు అవసరమైన వస్తువులతో కూడిన ‘కేసీఆర్‌ కిట్‌’ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కిట్ లో ఇప్పుడు సిరిసిల్ల నేత చీర చేరింది. ఈ చీరల తయారీ కాంట్రాక్టును సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగిస్తూ ‘టెస్కో (తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ)’సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన 6 లక్షల చీరలను (విత్‌ బ్లౌజ్‌) అందజేయాలని టెస్కోను వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ కోరారు. టెస్కో ఈ కాంట్రాక్టును సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని 54 మ్యాక్స్‌ సొసైటీలకు ఈ 6 లక్షల చీరల తయారీని విడతల వారీగా అప్పగించేందుకు చేనేత, జౌళి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

'KCR Kits' to newborns

నెలకు 50 వేల చీరల చొప్పున ఏడాది పొడవునా తయారీ కొనసాగనుంది. 54 మ్యాక్స్‌ సొసైటీల్లోని దాదాపు ఆరు వేల మందికి ఉపాధి దొరకనుంది. మొదటి విడతలో మే నాటికి 50 వేల చీరలను అందజేసేలా సొసైటీలతో అధికారులు సోమవారం ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం సూచించిన మేర ఐదు రంగుల్లో చీరలు తయారు చేయనున్నారు. సిరిసిల్లలో చీరలను తయారు చేశాక వాటిపై హైదరాబాద్‌లో డిజైన్లను ముద్రించనున్నారు.

- Advertisement -