తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ

429
cm kcr
- Advertisement -

తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ బంధం పటిష్టం చేయడంలో మరో ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్ర,శనివారాల్లో సమావేశం కానున్నారు. శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభంకానుంది.

గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరగడంతో దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నద్ధమయ్యారు.

ముఖ్యంగా గోదావరి వరద జలాల తరలింపు, కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటిని రెండు రాష్ట్రాలు సమగ్రంగా వినియోగించుకోవడం, విద్యుత్తు సంస్థల విభజన, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా పలు కీలకాంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించి ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -