సీఎం కేసీఆర్…ప్రజా దర్బార్‌

177
cm kcr ts

పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ మున్సిపల్ బిల్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ అడవులను నష్టపోకుండా చూసుకోవాలి. గిరిజనులను రక్షించాలన్నారు.

గిరిజనులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని …నిబంధనల ప్రకారం పేద గిరిజనులకు హక్కులు ఇస్తాం… రైతు బీమా, రైతు బంధు వచ్చేలా చేస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని జిల్లాలకు స్వయంగా తానే వెళ్తానని… అన్ని జిల్లాలకు, డివిజన్లకు మంత్రివర్గాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ అధికారులను తీసుకెళ్తానని చెప్పారు సీఎం. ఒక ఇంచు అటవీ భూమి ఆక్రమణ కానివ్వమని వెల్లడించారు.

పారదర్శకత కోసమే తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. 75 గజాల లోపు జీ ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదన్నారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి రియల్ టైమ్ పరిపాలనా సంస్కరణలు తీసుకురాబోతున్నామని చెప్పారు . ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందన్నారు. ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తామని చెప్పారు.