కోమటిబండకు సీఎం కేసీఆర్‌

549
kcr komatibanda
- Advertisement -

గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో 456 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు గజ్వేల్‌ మండలం కోమటిబండగుట్టపై నిర్మించిన మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ బుధవారం సందర్శించనున్నారు. జిల్లా కలెక్టర్లు,మంత్రులతో ఇక్కడ సమావేశం కానున్నారు.

రెవెన్యూ సంస్కరణలతో పాటు హరితహారం, మిషన్‌ భగీరథలపై కలెక్టర్లకు వివరించనున్నారు. కోటి 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ భారీ సంప్‌హౌస్‌ నుంచి నిత్యం నీటి సరఫరా జరుగుతోంది.దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిన మిషన్‌ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రధాని మోడీ 2016లో ప్రారంభించారు.

సంప్‌హౌస్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మిషన్‌ భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మిషన్‌ భగీరథ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు పోలీసులు.

- Advertisement -