కాళేశ్వరం.. రైతుల కలల ప్రాజెక్టు

385
KCR for Kaleshwaram project
- Advertisement -

నీళ్లు, నిధులు, నియామకాలు  నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కేసీఆర్ కార్యదక్షత, సబ్బండ వర్గాల పోరాటంతో స్వరాష్ట్ర ఆకాంక్ష నేరవేరింది. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషిచేస్తున్నారు. ఉద్యమం సాగుతున్న సమయంలో ఏపల్లెలో ఏగడప దట్టిన వినిపించిన పాటలు..గోదారి గోదారి పారేటి గోదారి..చుట్టు నీళ్లు ఉన్న చుక్క  దొరకని ఎడారి ఈ భూమి..మాది తెలంగాణ భూమి. తలపున పారుతుంది గోదారి..మా చేను మా చెలక ఏడారి. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎన్నోపాటలు బాణంలా నిలిచాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడానికి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ని చేపట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీడు బారిన పొలాలు పచ్చబడే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ వెతలు, కష్టాల కారణాలు తెలిసిన వ్యక్తిగా వాటన్నింటినీ రూపు మాపేందుకు కంకణం కట్టుకున్నారు.

 KCR for Kaleshwaram project
అందుకే నాడు ఉద్యమకారుడిగా నేడు బంగారు తెలంగాణ రథసారధిగా తానే ఓ ఇంజనీరై ప్రాజెక్టుల డిజైనింగ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం కానుంది. 2018 డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం,అధికారులు అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు మావోయిస్టుల ఖిల్లా కరీంనగర్‌లో పర్యటించిన సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాల్వల నిర్మాణాల పనులను పరిశీలించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ వద్ద 3 టీఎంసీల నీటిని తరలించేలా సివిల్‌ పనులు జరుగుతుండగా, ప్రస్తుతం 2 టీఎంసీలు తీసుకునేలా మోటార్ల బిగింపు కొనసాగుతోంది.

 KCR for Kaleshwaram project
జూన్‌ నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను పూర్తి చేసి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులపాటు 90 టీఎంసీలను ఎత్తిపోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి తగ్గట్లే పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రైతన్నలకు వరప్రదయినిగా మారనున్నాయి.

 KCR for Kaleshwaram project

- Advertisement -