సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ..

215
- Advertisement -

తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండగ చివరి రోజు బతుకమ్మను రాష్ట్ర అడపడుచులు ఆనందోత్సాహాలతో జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నూతన రాష్ట్రంలో ప్రకృతి మాత సహకరించడంతో భారీఎత్తున వర్షాలు కురిసి చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలని అభిలషించారు.

ఇక కరీంనగర్‌ జిల్లా జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో 15 అడుగుల భారీ బతుకమ్మను తయారు చేసి ప్రదర్శించారు. 10.5 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు, 980 కిలోల బరువుతో వివిధ రకాల పూలు, ఆకులతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మను రూపొందించారు. బతుకమ్మ తయారీ నుంచి శోభాయాత్ర వరకు ప్రక్రియను లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డుకు పంపించనున్నారు.

- Advertisement -