జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర..

274
- Advertisement -

జగిత్యాల జిల్లా నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఎంపీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణను మోసం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు మరోసారి ఏకమయ్యారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజలు ఆదరించేంత గొప్ప మనిషి జీవన్ రెడ్డి కాదని.. కేసీఆర్ మీద పోటీ చేసినందుకు కానుకగా ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్నారు.

కాంగ్రెస్ ఆగడాలు భరించలేకనే కేసీఆర్ అమరణదీక్షకు దిగారని.. ఉద్యమంలో ఏనాడు కనిపించని కాంగ్రెస్ నాయకులు.. తోడేళ్ల ముసుగు వేసుకుని వస్తే జనం గుర్తు పట్టారా.. అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేఅని జీవన్ రెడ్డి అన్నారని.. ఇప్పుడా సూత్రధారి, పాత్రధాని కాంగ్రెస్ నేతలా అని కవిత నిలదీశారు. జగిత్యాల జిల్లా ప్రజలు అమాయకులు కారని స్పష్టం చేశారు. ఒకప్పుడు జీవన్ రెడ్డి, ఎల్. రమణ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని.. ఇప్పుడు ఎలా ఒకటయ్యారని ఆమె ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తన భూముల చుట్టూ రోడ్డు వేసుకోలేదా… జీవన్ రెడ్డి తన భూముల ధరలు పెంచుకునేందుకు కొండగట్టు దగ్గర జేఎన్టీయూ ఏర్పాటుకు సహకరించలేదా.. రూ. 16 కోట్ల జనం డబ్బుతో జీవన్ రెడ్డి తన తమ్ముళ్ల భూముల చుట్టూ బైపాస్ రోడ్డు వేసుకున్న సంగతి నిజం కాదా.. అన్నారు.

జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదని… జీవన్ రెడ్డి 2009 ఎన్నికల అఫిడవిట్ లో తనకు మచ్చ బొల్లారం సర్వే నెం. 164లో రూ. 15 లక్షల విలువచేసే 933 గజాల స్థలం ఉందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి రెండుసార్లు సమర్పించిన అఫిడవిట్ లో ఏం ఉందో చెప్పాలని.. దీనిపై ఈసీని కలుస్తామన్నారు.

- Advertisement -