#MeTooనే కాదు #SheToo కూడా..

532
Katy perry
- Advertisement -

కొంతకాలంగా MeToo ఉద్యమం దేశాన్ని ఉపేసిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలలో ఉన్న ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపులని బహిరంగంగా చెబుతూ ముచ్చెమటలు పట్టించారు. అయితే లైంగిక వేధింపులు మహిళలకు మాత్రమే కాదు పురుషులకు ఉండవా అంటూ ఓ నటుడు తనకు ఎదురైన అనుభవాన్ని #SheToo హ్యాష్‌ ట్యాగ్‌తో వెల్లడించాడు.

అమెరికాకు చెందిన నటుడు జోష్ క్లోస్…గాయని క్యాటీ పెర్రీపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 2010లో తాను క్యాటీ పెర్రీతో కలిసి టీనేజ్ డ్రీమ్ మ్యూజిక్ వీడియో చేశానని తెలిపిన క్లోస్…. షూటింగ్ మొదలైన రోజు నుంచి ముద్దులు పెడుతూ సెట్‌లో తనలో కోరికలు కలిగేలా చేసేదని చెప్పాడు.

ఓ రోజు తమ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లామని, అక్కడ ఆమె తన అనుమతి లేకుండా ఫ్యాంట్ లాగేసి మర్మాంగాన్ని అందరికీ చూపించి హేళన చేసిందంటూ తెలిపాడు. ఆమె చేసిన పనికి నాకెంతో బాధ వేసిందని తెలిపాడు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోజుల్లోనే ఈ విషయాన్ని బయటపెట్టి సొమ్ము చేసుకునేవాడిని… కానీ నాకు డబ్బుతో అవసరం లేదన్నారు. తన అనుభవం.. ఇతర మగాళ్లకైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా తెలిపారు. మీటూ ఉద్యమంలానే షీటూ ఉద్యమం కూడా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి.

- Advertisement -