‘భారత్‌’ సెట్‌లో బ్యాటింగ్‌ చేసిన కత్రినా.. వీడియో

226
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ మేక‌ప్‌లు వేసుకొని సినిమాల‌తో బిజీగా గడుపుతూవుంటుంది. అయితే ఈ అమ్మడు క్రికెట్‌ గ్రౌండ్‌లో అడుగుపెట్టింది. క్రికెట‌ర్ అవ‌తారంలోకి మారిన ఈ అమ్మ‌డు బ్యాట్‌తో బంతిని బౌండ‌రీ లైన్‌కి త‌ర‌లించింది. గ్రౌండ్‌లో ఉన్నవాళ్లంద‌రు క‌త్రినా బ్యాటింగ్ తీరు చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోని క‌త్రినా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వ‌ర‌ల్డ్ క‌ప్ టీంలో త‌న‌ని ఎంపిక చేయ‌మ‌ని అనుష్క శ‌ర్మని కోరింది.

Katrina Kaif

ఈ వీడియోలో కత్రిన బ్యాంటింగ్‌ చేస్తూ బంతిని బౌండరీ దాటించారు. ఆమె ఆడే తీరుకు సోషల్‌మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యారు. కత్రినలో చాలా నైపుణ్యం ఉందని అభినందించారు. ‘అద్భుతంగా ఆడుతున్నారు, భారత మహిళా క్రికెట్‌ జట్టుకు మరో క్రీడాకారిణి దొరికినట్లుంది, అద్భుతం‌‌..’ అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

‘భారత్‌’ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కత్రినా కైఫ్‌, దిశా పటానీ కథానాయికల పాత్రల్లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జఫార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కత్రిన విభిన్న పాత్ర, లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -