రాత్రిపూట సీక్రెట్‌గా కలుసుకున్న హీరో,హీరోయిన్‌..!

300
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరోసారి ప్రేమలో పడిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గతంలో ఈ భామ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు. కొంతకాలం తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ రణ్‌బీర్, కత్రినా విడిపోయారు.

ఇదిలావుంటే మళ్ళీ చాలాకాలం తర్వత మరోసారి కత్రినా ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరనేగా మీ సందేహం ఆ హీరో మరెఎవరో కాదు విక్కీకౌశల్‌. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని,డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

katrinakaif

అయితే ఈ బాలీవుడ్ ప్రేమ జంట గతంలో దీపావళి పండుగ సందర్భంగా ఓ పార్టీలో మెరిశారు. అంటేకాదు ఓ రెస్టారెంట్‌లోనూ చెట్టాపట్టాలేసుకొని వచ్చిన కత్రినా, విక్కీల ఫోటోలను ఓ చెఫ్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో వీరు ఈసారి ఎవరి కంటాపడకుండా కలుసుకుందామనుకున్నారో ఏమో.. తాజాగా మంగళవారం ముంబైలోని ఓ స్నేహితుని ఇంట్లో రాత్రివేళ అత్యంత రహస్యంగా వేర్వేరు కార్లలో వచ్చి కలిశారని సమాచారం.

ఈ ఫోటోలను కూడా ఓ ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆవి కాస్తా మీడియాలో రావడంతో వీరి డేటింగ్ గుట్టు మరోసారి బయటపడింది. అయితే ఈ ప్రేమజంట ఎన్ని సార్లు మీడియా కంటపడినా వారి ప్రేమ వ్యవహారం గురించి మాత్రం నోరు విప్పడం లేదు. ప్రస్తుతం ఈ టాపిక్‌ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -