య్యూట్యూబ్ లో కాటమరాయుడు ….

259
- Advertisement -

పవన్‌కళ్యాన్‌ నటింస్తున్న కాటమరాయుడు సినిమా లీకైంది. ఈసినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ సీన్‌ లీకైంది. క్లైమాక్స్‌లో వచ్చే ఫైటింగ్‌ సీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు య్యూట్యూబ్‌లో పెట్టేశారు. గతంలో పవర్‌స్టార్‌ నటించిన అత్తారింటీకి దారేది సినిమా కూడా ఆన్‌లైన్‌లో లీకై పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Katamarayudu Climax Scene Leaked
అయితే పొస్ట్ ప్రోడక్షన్‌లో పనుల్లో బిజీగా కాటమరాయుడు సినిమా వీడియోను….ఎడిటింగ్‌ రూమ్‌ నుంచే లీక్‌ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఈ వీడియో లీకవడంపై పవన్ కళ్యాన్‌ అభిమానులు ఒక్కింత ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.వెంటనే ఆ వీడియోను నెట్ నుంచి తీసేయాలని సినిమా నిర్మాతలకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఆ వీడియోను వీలైనంత త్వరగా తీసేసేందుకు చిత్ర యునిట్‌ ప్రయత్నిస్తోంది. కాగా, సినిమా వీడియోనే కాకుండా, క్లైమాక్స్‌కు సంబంధించిన ఫొటోలనూ దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టేశారట. దీనిపై స్పందించిన నిర్మాత శరత్ మరార్, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, సినిమాపై అంచనాలు తగ్గకుండా చూసుకుంటున్నాడని చెబుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌పై కావలనే కొందరు కుట్రపూరితంగా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని పవన్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.

- Advertisement -