మరోసారి అర్జున్ జంధ్యాలతో కార్తీకేయ..

746
arjun jandhyala
- Advertisement -

RX100 వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో కార్తీకేయ. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన కార్తీకేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. రీసెంట్‌గా హిప్పీతో ప్రేక్షకుల ముందుకువచ్చినా అంతగా మెప్పించలేకపోయాడు. కానీ తాజాగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన గుణ 369తో హిట్ కొట్టాడు కార్తీకేయ.

ఇక ఈ సినిమా తర్వాత తన నెక్ట్స్‌ మూవీ అర్జున్ జంధ్యాలతోనే ఉండబోతుందని చెప్పారు కార్తీకేయ. ఈ ఏడాది చివరలో సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందని చెప్పాడు. మంచి సినిమా తీయాలనే ఓ ఫైర్ అతనిలో కనిపించింది అని తెలిపారు. హిప్పీ మూవీ ఫెయిల్యూర్ పక్కన పెడితే గుణ 369 తనకు చాలా ప్రత్యేకమైందని చెప్పారు.

తాను ఎప్పుడూ దేనికదే కొత్తగా చేయాలని ప్రయత్నిస్తానని… ప్రతీ సినిమా కొత్త జర్నీ అన్నారు. అయితే సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన ఆలోచనల్లో మార్పు ఉండదని చెప్పారు.సినిమాకు హీరో ఫేస్ కాబట్టి.. హిట్ అయితే ఎక్కువగా పేరు వస్తుందని…. కష్టపడేది వాళ్లు.. ఎంజాయ్ చేసేది మేము అని కార్తీకేయ అన్నారు.

- Advertisement -