నాకంటే కార్తికేయ నటనే బాగుందన్నారుః నాని

573
Nani Karthikeya
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అనిరుథ్ సంగీతం అందించిన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించింది. బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతుంది.

నాని ఖాతాలో మరో బంపర్ హిట్ వేసుకున్నట్ఏల అని చెప్పుకోవాలి. సినిమా సక్సెస్ పుల్ గా నడుస్తుండటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఆర్ఎక్స్ 100సినిమా హీరో కార్తికేయ ఈమూవీలో విలన్ గా నటించారు. అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కార్తీకేయ నటన గురించి చెప్పాడు నాని.

సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈమూవీని నా నటన కంటే విలన్ గా నటించిన కార్తికేయ నటన చాలా బాగుంది అని చాలా మంది తనతో చెప్పారన్నారు. ఇక నాని తన తర్వాతి మూవీ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేయనున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈమూవీలో సుధీర్ బాబు నటించనున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈచిత్రం త్వరలోనే ప్రారంభంకానుంది.

- Advertisement -