ఇదంతా బీజేపీ కుట్రే…అధికారంపై ఆశలేదు :కుమారస్వామి

391
kumaraswamy vs yedurappa
- Advertisement -

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.గురువారం శాసనసభలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ చర్చ చేపట్టారు. చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.

కర్నాటక సంకీర్ణ సర్కార్ ను కూల్చే ప్రయత్నం నిరంతరం జరిగిందన్నారు కుమారస్వామి. బీజేపీ సహకారంతోనే ఎమ్మెల్యేలు సుప్రీంకు వెళ్లారని చెప్పారు. అధికారాన్ని లాక్కునే కుట్ర జరిగిందని తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేలు నా పై అసత్య  ఆరోపణలు చేశారని చెప్పారు. బీజేపీ మార్గదర్శనంలోనే సంకీర్ణ సర్కార్ పై కుట్ర జరిగిందని తెలిపారు.

రాష్ట్రా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని చెప్పారు. మా మెజార్టీని నిరూపించుకుంటామని చెప్పిన కుమారస్వామి…ప్రజాస్వామ్యాన్ని పరీరక్షించడమే తన బాధ్యత అన్నారు. ఎమ్మెల్యేలంతా తమ సర్కార్ పనితీరుపై సంతృప్తితో ఉన్నారని చెప్పారు. సీఎం పదవి కోసమో అధికారం కోసమో ఎనాడూ పాకులాడలేదని చెప్పారు. అందరం కర్ణాటక అభివృద్ధి కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ పాత్రను కూడా కొంతమంది అభాసుపాలు చేశారు…కానీ స్పీకర్ ఎప్పుడు నిష్పక్షపాతంగానే పనిచేశారని చెప్పారు.

కర్నాటక విధాన సభలో మొత్తం 224 మంది సభ్యులున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో సభ్యుల సంఖ్య 208కి చేరింది. సభకు 206 మంది హాజరయ్యారు. మేజిక్ ఫిగర్‌ 104 కాగా సభలో కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల బలం 100 కాగా బీజేపీ సభ్యుల బలం 107కి చేరింది.  ఏదైన అద్భుతం జరిగితే తప్ప జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి గట్టెక్కడం కష్టమే…

- Advertisement -