కర్ణాటకలో ముదిరిన రాజకీయ సంక్షోభం..

529
karnataka
- Advertisement -

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్‌. నగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.భవిష్యత్‌లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు తిరుగుబాటు నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసమ్మతి నేతలను కేబినెట్‌లోకి తీసుకోవాలని యోచిస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ డీకే సురేశ్‌ చెప్పారు.

ఇదిలా ఉండగా కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చింది. మరికాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం కుమారస్వామి వెళ్లనున్నారు. మంత్రుల రాజీనామా పత్రాలతో గవర్నర్‌ను కుమారస్వామి కలవనున్నారు.

- Advertisement -