క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయం..సీఎం రాజీనామా..?

181
kumaraswamy

కన్నడ రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం కుమారస్వామి. ఈ మేరకు కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసిన కుమారస్వామి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్‌ను కలవనున్నారు కుమారస్వామి. అసెంబ్లీ రద్దు చేయాలని గవర్నర్‌కు సిఫారసు చేసే ఛాన్స్ ఉంది. దీంతో కన్నడలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది..

ఇక మరోవైపు కర్ణాటకలో నెలకొన్న సంక్షోభంపై పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు ఆ పార్టీ ఎంపీలు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ బీజేపీ దేశంలో పాలన సాగిస్తోందని విమర్శిస్తున్నారు.

ఇక సుప్రీం కోర్టులో ఇవాళ రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్పీకర్ కావాలనే తమ రాజీనామాలను పెండింగ్‌లో పెట్టారని వాటిని అమోదించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.