క్రిష్ హ్యాండిస్తే…నేను పూర్తిచేశా: కంగనా

471
krish kangana
- Advertisement -

మణికర్ణిక మూవీ సందర్భంగా దర్శకుడు క్రిష్‌తో తలెత్తిన వివాదాన్ని మళ్లీ లేవనెత్తారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. సినిమా మధ్యలో క్రిష్ తనకు హ్యాండిచ్చాడని మండిపడ్డారు.

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్రలో నటించారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో క్రిష్‌కు కంగనకు మధ్య క్రియేటివిటీ సమస్యలు వచ్చాయి.

దీంతో తాను సినిమా చేయనని చెప్పి తప్పుకున్నారు క్రిష్. ఈ వివాదంపై ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన కంగనా తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో నేను దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాను. ఆ రకంగా నేను సినిమాకు, నిర్మాతలకు సాయం చేస్తే నన్ను మెచ్చుకోవాల్సిందిపోయి నోటికొచ్చినట్లు తిట్టారని చెప్పారు.

అయితే కంగన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఏడాది క్రితం క్రిష్ క్లారిటీ ఇచ్చారు. ఇంకెప్పుడూ కంగనతో కలిసి పనిచేయనని తేల్చి చెప్పేశారు.

- Advertisement -