‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చంద్రబాబు ఫస్ట్ లుక్

376
Kamma Rajyamlo Kadapa Redlu Chandrababu

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాను తెరెక్కిస్తున్నారు. ఏపీలో రాజకీయం మొత్తం క్యాస్ట్ మీదనే నడుస్తుందని ఈసినిమా సారాంశం. ఇక ఈసినిమాపై పలు కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎదో ఒక విధంగా తన సినిమాకు పబ్లిసిటి పెంచుకుంటున్నారు.

ఇటివలే ఈసినిమాలో ప్రభాస్ కు కూడా ఇన్వాల్వ్ చేశాడు వర్మ. కొద్ది రోజుల క్రితం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఇటివలే సాహో విడుదల సందర్బంగా క్యాస్ట్ ఫిలింగ్ సాంగ్ ను విడుదల చేశారు.

తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో అప్ డేట్ చెప్పారు వర్మ. సెప్టెంబరు 7వ తేదీ ఉదయం 9.27 గంటలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా షూటింగ్ శరవేగంతో సాగుతోందంటూ వెల్లడించారు. అంతేకాకుండా ఈసినిమాలో చంద్రబాబు పాత్రకు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేశారు.