రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్..!

438
kamal

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. 1996లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరం(రాజమండ్రి) సెంట్రల్ జైల్లో జరుగుతోంది. 20 రోజుల పాటు ఇక్కడ జరిగే షూటింగ్‌లో కమల్‌కు సంబంధించి కీలక సన్నివేశాలు తీయనున్నట్లు సమాచారం.

రెండో షెడ్యూల్‌లో భారీ పోరాట సన్నివేశాలు తీయనుండగా ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హీన్స్ కంపోజ్ చేయనున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్,కాజల్ అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా నవంబర్‌లో చిత్రయూనిట్‌తో జాయిన్‌ కానుంది కాజల్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుథ్ రవిచందర్ అందిస్తున్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్.. సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3తో బిజీగా ఉన్నారు. గత రెండు సీజన్లకు కూడా కమల్ హాసనే హోస్ట్‌గా వ్యవహరించారు.