మెగా హీరో “సూపర్ మచ్చి” ఫస్ట్ లుక్

491
Super Machi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్నళ్లుడు క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రానికి సూప‌ర్‌మ‌చ్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. వ‌ర్షంలో స్నేహితుల న‌డుమ హీరో క‌ల్యాణ్‌దేవ్ న‌వ్వుతూ ఉండే లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రెహ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానున్న శ్రీవిష్ణు `తిప్ప‌రామీసం` చిత్రాన్ని నిర్మించిన రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుత‌న్న చిత్ర‌మిది.

- Advertisement -