హ్యాపీ చిల్డ్రన్స్‌ డే…:కవిత

532
kalvakuntla kavitha
- Advertisement -

బాలల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. నేటి బాలలే రేపటి పౌరులని తెలిపిన కవిత…భావితరాలకు మంచిభవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సమాజంలోని అన్ని వర్గాలు పని చేయాలని కోరారు.

బాల్యం.. ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటుండగా మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు.

kalvakuntla  kavitha

- Advertisement -