జ‌ర్న‌లిస్టులూ క‌రోనాతో జాగ్ర‌త్త: మాజీ ఎంపీ కవిత

229
kavitha trs
- Advertisement -

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అందరిని ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు మాజీ ఎంపీ కవిత. ముంబైలో జర్నలిస్టులకు కరోనా‌ పాజిటివ్ వచ్చిందన్న వార్తలు దురదృష్టకరం. కరోనా‌ మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టు మిత్రులు , వార్తలను ప్రజల వద్దకు చేరవేసేటప్పుడు తమను, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని ‌అభ్యర్థిస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ముంబైలో 170 మంది రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, డ్రైవర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 53 మందికి పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. వీరిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.

kavitha

- Advertisement -