ఇరుకుల్ల వాగుకు కాలేశ్వరం జల కళ..

590
- Advertisement -

సీఎం కేసీఆర్ కృషి ఫలించింది ప్రతి బీడు భూమిని ముద్దాడేందుకు కాలేశ్వరం జలాలు వడివడిగా పరుగెత్తుతున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ చొరవతో కాలేశ్వరం నీళ్లు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగుకు చేరాయి. కాలేశ్వరం నీళ్లు తమ ప్రాంతానికి చేరుకోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామ రైతులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇరుకుల్ల చెరువు వద్ద సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

kaleshwaram water

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ చెక్ డ్యామ్ లోకి చేరిన కాళేశ్వరం గోదావరి జలాలు ఇరుకుళ్ల వాగు గుండా పరవళ్ళు తొక్కుతోంది గోదావరి జలాలతో వాగు నిండుకుండలా పారడంతో శివారు గ్రామలైన, వల్లంపాడ్ , గోపాల్ పూర్, దుర్షేడ్, చేగుర్తి, నల్లగుంటపల్లి, మొగ్ధుమ్ పూర్, మందులపల్లి, గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

25 యేండ్ల తర్వాత ఈ వాగులో నీరు పారడంతో బోరు బావులలో ఊట పెరిగింది. దీంతో ఆయకట్టు రైతుల కళ్ళల్లో సంతోషం తొణికిసలాడుతుంది. తమ పాదాల చెంతకు గోదావరి జలాలను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

kcr

ఇదంతా సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలు 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు నీళ్లతో కలకలడుతున్నాయని స్థానిక ప్రజలు చెప్పారు. గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించి ప్రతి రైతు ఇంట్లో సీఎం కేసీఆర్ ఓ కుటుంబ సభ్యుడు అయ్యారని పేర్కొన్నారు.

- Advertisement -