లోయర్ మానేరులోకి నీళ్లు..జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే

346
lower Maner Mla Gangula
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి దిగువన ఉన్న లోయర్ మానేర్ డ్యాంకు నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో లోయర్ మానేర్ లోకి కాళేశ్వరం జలాలు చేరడంతో జలహారతి ఇచ్చారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎమ్మెల్యేతో పాటు స్ధానిక మహిళలు అక్కడికి వచ్చి జలహారతిలో పాల్గోన్నారు.

Lower Maner Kcr
25 గేట్ల ద్వారా మొత్తం 41వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. దీంతో లోయర్ మానేర్ డ్యాం జలకళతో సంతరించుకుంది.శ్రీ రాజరాజేశ్వర జలాశయం ప్రస్తుత నీటిమట్టం 15టీఎంసీలు ఉండగా పూర్ధి స్ధాయి నీటి మట్టం 25.873 టీఎంసీలు ఉంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం కు వరద కాలువ నుంచి పది వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో పోటెత్తుండగా, 41 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో వరద నీరు వస్తుంది. లోయర్ మానేర్ డ్యాంకు నీరు రావడంతో రైతులు ఆనందపడిపోతున్నారు.

- Advertisement -