అద్భుత ఘట్టంగా…. కాళేశ్వరం ప్రారంభం

434
cm kcr kaleshwaram project
- Advertisement -

తెలంగాణను సస్యశ్యామలం చేయనున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయిజ ఈ నెల 21న ఉదయం పదిన్నర గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభోత్సవానికి గవర్నర్‌లు నరసింహన్‌,విద్యాసాగర్‌ రావుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌,ఏపీ సీఎం జగన్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ప్రతిష్టాత్మక కాళేశ్వర సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ప్రాజెక్టు ప్రారంభ స్థలిలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభకు పెద్దఎత్తున జన సమీకరణ ఏర్పాట్లు చేస్తోంది.కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద నిర్వహించనున్న యాగాలకు జలసంకల్ప యాగాలు అని నామకరణం చేశారు.

దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా సంబురాలు జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొదటి పూజ, హోమ క్రతువు ఉంటాయి. తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్‌ ప్రారంభోత్సవం ఉంటుంది. కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులకు స్విచ్‌ఆన్‌ చేస్తారు.

గోదావరి జలాలను గ్రావిటీ కాలువలో ఎత్తిపోసే స్థలం వద్ద అరగంటపాటు వైదిక క్రతువు ఉంటుంది. కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుణున్ని ఆహ్వానించే హోమం చేస్తారని తెలిసింది. ప్రారంభోత్సవం అనంతరం స్వామి సన్నిధానంలో గోదావరి జలాలతో సీఎం కేసీఆర్‌ అభిషేకం నిర్వహిస్తారని సమాచారం. తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు పోలీసులు. మొత్తంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆరంభం అదిరిపోనుంది.

- Advertisement -