జూన్ 21..తెలంగాణ ప్రజలకు పండగరోజు

407
kaleshwaram project
- Advertisement -

అంతరాష్ట్ర వివాదాలను స్నేహభావంతో పరిష్కరించుకుని,కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు సాధించి అడ్డంకులన్నింటినీ చాకచక్యంతో అధిగమించి,కేవలం మూడేళ్ల అతి స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బహుళార్థక సాదక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 21న జాతికి అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్.

సీఎం కేసీఆర్ సాగించిన భగీరథ ప్రయత్నం ఫలించి,బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావడం తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించిన రికార్డు సృష్టించిడం భారతదేశానికి గర్వకారణం.

ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందనుంది. ప్రతీ ఇంటికి ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకానికి అవసరమైన నీటి సరఫరా జరుగుతుంది. కోటి జనభా కలిగిన హైదరాబాద్ మహానగరానికి ప్రతీ రోజు మంచినీరు అందనుంది. జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌,ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.

ఇక భారతదేశ సాగునీటి పారుదల రంగం చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
()ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 139 మెగావాట్ల గరిష్ట సామర్ధ్యం కలిగిన పంపులు
()ప్రపంచంలోనే అతి పొడవైన 203 మీటర్ల సొరంగ మార్గం
()ఒకరోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగలిగిన ప్రాజెక్టు ప్రపంచంలో కాళేశ్వరం ఒక్కటే. వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి
()ఒకే ఒక ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు,వేలాది గ్రామాలకు మంచినీరు,వందలాది పరిశ్రమలకు నీరు అందించడం ఇదే ప్రథమం
()గోదావరి నీటిని 92 మీటర్ల ఎత్తు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోసి,ఎక్కడికక్కడ ఆయకట్టుకు నీరందిస్తూ,చివరికి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపడం ఇదే ప్రథమం.

- Advertisement -