దివ్యాంగులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక సాయం పెంపు

449
Kalayana Lakshmi
- Advertisement -

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా లబ్ది పొందే దివ్యాంగులకు శుభవార్త తెలిపింది తెలంగాణ సర్కార్. దివ్యాంగులకు కళ్యాణలక్ష్మీ ద్వారా వచ్చే సాయాన్ని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్. సాధారణ లబ్ది దారుల కంటే 25 శాతం ఎక్కువ దివ్యాంగులకు ఇవ్వాలన్న కేంద్ర చట్టానికి లోబడి సాయాన్ని పెంచినట్లు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహం కోసం ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తూ వస్తోంది.

దివ్యాంగ పెళ్లికూతురు తల్లితండ్రులకు ఇచ్చే కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ సాయం గతంలో లక్షా116రూపాయలు ఇవ్వగా ఇప్పుడు లక్షా 25వేలు ఇవ్వనుంది సర్కార్. 25శాతం సాయం పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగుల తల్లితండ్రులు.

- Advertisement -