మరోసారి చిరు సరసన చందమామ

420
chiru-kajal
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఈమూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీకి ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొదట ఈమూవీలో చిరు సరసన త్రిషను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల త్రిష మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. త్రిష స్ధానంలో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు చిత్ర యూనిట్.

తాజాగా ఉన్న సమాచారం మేరకు చిరంజీవి సరసన కాజల్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు స‌మాచారం. అతి త్వ‌ర‌లో దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. చిరంజీవి కాజల్ కాంబినేషన్ లో గతంలో ఖైదీ నెం150 సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈసినిమాలో మహేశ్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -