రవితేజ ‘కనకదుర్గ’ అప్‌ డేట్స్

237
Ravi Teja
- Advertisement -

రాజా ది గ్రేట్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్‌ అక్బర్‌ ఆంటొని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి.ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మాస్ మహారాజా. ప్రస్తుతం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో చేస్తున్న రవితేజ ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే మరో సినిమాను కూడా ఫైనల్ చేశాడు.

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన తేరి సినిమాను సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. తమిళ్‌లో విజయ్‌ హీరోగా నటించగా సమంత,అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగులో రవితేజ సరసన కాజల్‌ అగర్వాల్‌, కేథరిన్‌ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో రవితేజకి భార్యగా కాజల్ కనిపించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో రవితేజ-కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వస్తున్న వీరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -