‘సీత’ ప్రీమియర్ షో రివ్యూ..

180
Kajal Aggarwal

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన ‘సీత’ మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సోనూసుద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ లతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. యూఎస్ ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఈ చిత్రానికి ఎలా టాక్ వస్తుందో చూద్దాం.

Kajal Aggarwal

ఈ సినిమా టైటిల్ లోనే అర్ధం ఏంటో తెలిసిపోతుంది. హీరోయిన్ కాజల్ పేరు సీత. ఆమె చుట్టూనే కథ నడుస్తుంది. పురాణాల ప్రకారం సీత అంటే సైలెంట్ గా ఉండే మహిళా అని అర్ధం. కానీ, ఈ సినిమాలో సీత మాత్రం అలా కాదు. పూర్తి వ్యతిరేకం. తాను అనుకున్నది సాధించేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తుంది.

స్పష్టంగా చెప్పాలి అంటే బిసినెస్ విమెన్. బిజినెస్ కోసం ఎలాంటి ఎత్తులు వేసింది అన్నది కథ. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఫర్వాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కాస్త విసిగించాడని టాక్. ఏదైతేనేం సినిమాను ఒకసారి చూడొచ్చని సినీ వర్గాల సమాచారం.