మాల్దీవుల్లో కాజల్ బికినీ సవారీ.. !

598
kajal
- Advertisement -

ఇండస్ట్రీలోకి ఎంటరై 15 సంవత్సరాలు గడుస్తున్న తరగని అందంతో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. దక్షిణాదిలో స్టార్ హీరోలందరితో నటించిన ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది.

ప్రస్తుతం హాలీ డే ట్రిప్‌ను మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న కాజల్…తన అందాలతో కనువిందు చేసింది. బికినీలో హంస బొమ్మపై సవారీ చేస్తూ కుర్రకారు మతిపొగొట్టింది. కాజల్ ఇన్‌స్టాలో ఫోటోలను చూసిన నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం హిందీలో ‘ముంబై సాగా’,కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఇండియన్ 2’లో కీలకపాత్రలో నటిస్తోంది. తమిళంలో చేసిన ‘ప్యారిస్ ప్యారిస్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇటీవలె ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మను ఏర్పాటుచేయగా ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు.

- Advertisement -